/rtv/media/media_files/2025/02/06/7rgCBCvhJkJDU09ukPJo.jpg)
Telangana and Andhra Pradesh School Holidays on February
2025 ఏడాది ప్రారంభం నుంచే విద్యా సంస్థలకు సెలవులే సెలవులు వచ్చాయి. న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా జనవరి మొత్తం జాలీగా గడిచిపోయింది. ఇక ఇప్పుడు జనవరి నెల పోయి ఫిబ్రవరి నెల వచ్చింది. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
పుస్తకాల పురుగుల్లా చదివేస్తున్నారు. అయితే ఫిబ్రవరి నెలలో ఆదివారాలు కాకుండా మరేవైనా ఎక్స్‌ట్రా సెలవులు ఉన్నాయ అంటే ఒక్కటి మాత్రమే ఉంది. అదీ శివరాత్రి పండగ సెలవు. దీంతో ఫిబ్రవరి నెలలో మొత్తం 5 సెలవులు లభించనున్నాయి. అయితే ఈ ఐదు రోజులు మాత్రమే కాకుండా మరో సెలవు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
రెండు రోజులు సెలవులు
అవును మీరు విన్నది నిజమే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. దీని కారణంగా ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు పోలింగ్ రోజున సెలవు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
గతంలో టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సర్కార్ సెలవు ప్రకటించింది. అందువల్ల ఈ సారి కూడా సెలవు ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దాంతోపాటు ఫిబ్రవరి 26న శివరాత్రి కావడంతో ఇప్పటికే పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 27న సెలవు ప్రకటిస్తే ఈ రెండు రోజులు సెలవులు రానున్నాయి అనే చెప్పాలి.
ఈ పోలింగ్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్నాయి. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్,కరీంనగర్, ఉమ్మడి జిల్లాలకు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలోని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, గ్రాడ్యుయేట్ స్థానాలకు.. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది.