HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనువడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్ఎస్‌ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కొడుకు కనిష్క్‌ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తీగల కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

New Update
Teegala krishna -reddy -grandson -kanishk -reddy died in Road Accident

Teegala krishna reddy grandson kanishk reddy died in Road Accident

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనువడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్ఎస్‌ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కొడుకు కనిష్క్‌ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తీగల కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ శివారులోని గోళ్లపల్లి కలాన్‌ వద్ద ORRపై కనిష్క్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. 

Also Read: ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు

అక్కడున్న వాళ్లు గమనించి అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కనిష్క్‌ రెడ్డికి తీవ్రంగా గాయాలు కావడంతో అతడి ఆరోగ్యం విషమించింది. చివరికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నవయసులోనే కనిష్క్‌ రెడ్డి మరణించడంతో తీగల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలాఉండగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనంపై బయటికి వచ్చామంటే తిరిగి సురక్షితంగా ఇంటికీ వెళ్తామో? లేదో? అనే గ్యారెంటీ కూడా లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదా ఇతరుల మరణాలకు కారణమవుతున్నారు. 

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు