యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట ఎస్పీ స్పందించారు. ఈ మేరకు ఆయన RTVతో పలు సంచలన విషయాలు పంచుకున్నారు. బయ్యా సన్నీ యాదవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడనే కారణం మీద నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం అన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
సమాచారాన్ని సేకరిస్తున్నాం
అతడ్ని పట్టుకోవడానికి టెక్నికల్‌గా కూడా ప్రయత్నిస్తున్నామని అన్నారు. దానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ వేరే దేశంలో ఉన్నాడని అన్నారు. ఈ సందర్భంగా యువతకి, పబ్లిక్, విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
ఎవరు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ వైపు వెల్లకూడదని అన్నారు. ఇవన్నీ మిమ్మల్ని మోసం చేసే అప్లికేషన్లు అని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం ఎవరైనా ప్రోత్సహించినా లేదా నడిపినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
ఇప్పటికే ఈ విధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుందని అన్నారు. ఇక బయ్యా సన్నీ యాదవ్ మాటలు విని మోసపోయిన వారు ఉంటే పోలీసులను అప్రోచ్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...