Suryapet: అయ్యో బాల గాంధీ.. పెద్దగట్టు జాతరలో కన్నీరు పెట్టించే దృశ్యం!

సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర దృశ్యం కలిచివేసింది. గాంధీ తాత వేషధారణలో ఓ బాలుడు 5 రోజులుగా రాత్రిపగలు యాచించి అలసిపోయాడు. దీంతో మిట్ట మధ్యాహ్నం ఎండలోనే నేలపై కునుకు తీశాడు. ఈ ఫొటో వైరల్ అవుతుండగా 'అయ్యో బాలగాంధీ' అంటూ సింపతి చూపుతున్నారు.  

New Update
peddda gattu

peddda gattu Photograph: (peddda gattu)

Suryapet: సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర ఘటన కలిచివేసింది. పొట్టకూటికోసం దేహీ దేహీ అంటూ భిక్షాటన చేసిన బాల గాంధీ ఎండకు అలిసిసొలసి అక్కడే బండలపై కునుకు తీస్తున్న దృశ్యం ఎంతోమంది పేదల సానుభూతిపరులను కన్నీరు పెట్టించింది. ఈ మేరకు గత 5 రోజులుగా సూర్యాపేట దురాజ్ పల్లి శివారు పెద్దగట్టుపై శ్రీ లింగమంతుల స్వామి జాతర జరిగింది. ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా డబ్బులు, బట్టలు, ఆహారం అడుక్కునేందుకు ఎంతోమంది నిరుపేదలు వచ్చారు. 

యాచించి అలసిపోయిన పసివాడు..

ఇందులో భాగంగానే బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కొన్ని కుటుంబాలు భిక్షాటన కోసం పెద్దగట్టు జాతరకు వచ్చాయి. పగలు రాత్రి యాచించి గట్టుపైనే నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలోనే గాంధీ తాత వేషధారణలో ఉన్న ఓ బాలుడు 5 రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి గుట్టపై అడుక్కుంటున్నాడు. అయితే యాచించి అలసిపోయిన ఆ పసివాడు గురువారం మధ్యాహ్నం ఎండలోనే బండలపై నిద్రపోయాడు. ఈ దృశ్యం మీడియా కెమెరా కంటపడగా క్షణాల్లో వైరల్ అయింది. సాలామంది సానూభూతిపరులు అతనిపై సింపతి చూపిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: Hyderabad: ఆకతాయిల ఆటకట్టించిన షీ టీమ్స్.. హైదరాబాద్‌లో 247 మంది అరెస్ట్!

ఓ లింగ.. ఓ లింగా...

ఇదిలా ఉంటే.. ఐదు రోజులు సాగిన దురాజ్‌‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర గురువారంతో ముగిసింది. ఆ ప్రాంతమంతా ఓ లింగ.. ఓ లింగా నామస్మరణతో మార్మోగింది. జాతర చివరిరోజు భక్తులు భారీగా తరలివచ్చారు. గొర్రె పిల్లను బలిచ్చి మకర తోరణాన్ని యాదవ కులపెద్దలు సూర్యాపేటలోని గొల్ల బజారుకు తరలించడంతో జాతర పరిసమాప్తమైంది. ఇక గతేడాది ఈ జాతరకు రూ.25,71,294 ఆదాయం రాగా ఈసారి రూ.31,29,686 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక 30 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Eknath Shinde: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే.. ఏమన్నారంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  శోభాయాత్రలో రాజాసింగ్‌ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో  భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్‌ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.  

ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment