/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
GROUP 1 EXAMINATIONS: తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ పరీక్షా వాయిదా వేయాలంటూ గ్రూప్ -1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ రద్దుతో పాటు మెయిన్స్ పరీక్ష వాయిదాకు ధర్మసనం నిరాకరించింది. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. TGPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారంగానే పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.
Also Read: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!
హైకోర్టు తీర్పుకు సై..!
గతంలో కొందరు అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. TGPSC నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లో 14 తప్పులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని హైకోర్టును కోరారు. కాగా అభ్యర్థులు వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. గ్రూప్ 1 పరీక్షలు యథాతంగా జరుగుతాయని స్పష్టం చేసింది.
Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిన అభ్యర్థులు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుందని చెప్పింది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్
Also Read: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
BIG BREAKING: తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
pregnant scam : 30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!
BIG BREAKING: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు
Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..