/rtv/media/media_files/2025/09/01/supreme-court-2025-09-01-20-13-48.jpg)
Supreme Court
పోలవరం నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ దాఖలు పిటిషన్‌పై విచారణకు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందని తెలిపింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేసి పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి తెలిపారు. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని పేర్కొన్నారు.
Also Read: బెంగళూరు టెకీ మృతి కేసులో సంచలనం.. లైంగిక దాడికి యత్నించి..
సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. గత సోమవారం కూడా దీనిపై విచారణ జరిగిందని.. ఆనాడు ఇచ్చిన వాదనలకు అదనంగా ఈరోజు మరిన్ని వాదనలు వినిపించామన్నారు. ఇక్కడ కేటాయింపుల కన్నా ఎక్కువ నీళ్లు వాడొద్దనేదే కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఏపీ సర్కార్ చాలా ఉల్లంఘనలు చేసినట్లు చెప్పారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను కూడా అమలు చేయడం లేదనే విషయాన్ని చెప్పామని తెలిపారు.
Follow Us