/rtv/media/media_files/2026/03/12/supreme-court-2026-03-12-14-12-12.jpg)
Supreme Court Closes BRS Defection Case Following Speaker's Decision
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించింది. స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఇప్పటికే ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పునిచ్చినారని కోర్టుకు తెలిపారు. సింఘ్వీ వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. అయితే స్పీకర్ తీర్పు కాపీలు తమకు ఇంకా రాలేవని బీఆర్‌ఎస్ తరఫు లాయర్ తెలిపారు.
Also Read: కవిత ఇంటికి సీబీఐ అధికారులు!
రెండు రోజుల్లో తీర్పు కాపీలు పిటిషనర్లకు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, పిటిషనర్ అడిగే వివరాలను నాలుగు రోజుల్లో అందజేయాలని తెలిపింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ తీర్పు ప్రకటించాక ఈ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు పరిమితులు ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Also Read: ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?
అసలేంటి ఈ కేసు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ సహా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 10 వ షెడ్యుల్ ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డ ప్రసాద్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని.. బీఆర్ఎస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించింది.
మొదట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ దీనిపై పిటిషన్ తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండాన్ కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని కోర్టు తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన నాలుగు వారాల గడువును రద్దు చేసింది. దీంతో డివిజన్ బెంచ్ తీర్పును బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 3 నెలల లోపు (మార్చి 12 నాటికి) ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు విధించిన గడువు ముగియడానికి ఒక రోజు ముందే (మార్చి 11న) స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. వాళ్లందరిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ తీర్పునిచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఈరోజు దీనిపై విచారణ ప్రారంభం కాగా.. స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు స్పీకర్ తీర్పును ఏకీభవించింది.
Follow Us