Bhadrachalam : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
 Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మండపంలో ప్రవేశానికి సెక్టార్‌ టికెట్లను ఆన్‌లైన్‌తోపాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు. 7న మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ హాజరుకానున్నారు.

రాములోరి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం రూ.2.50కోట్లతో ఏర్పాట్లు చేపట్టింది. మిథిలాస్టేడియంలో 31వేల మంది భక్తులు సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం చూసేలా తీర్చిదిద్దారు.  ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్ సదుపాయాలను స్టేడియం ఆవరణలో  కల్పిస్తున్నారు. కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​చొరవతో ఏర్పాట్లు చేస్తున్నారు. 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను కూడా అమర్చుతున్నారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

భద్రాచలం, పర్ణశాలలో భక్తులకు చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. మజ్జిగ, చల్లని తాగునీటి ప్యాకెట్లను ఇవ్వనున్నారు. భక్తుల కోసం19 ప్రసాద, 60 తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. నవమి అనంతరం పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా ప్రసాదాలు, తలంబ్రా లు పంపిణీ  చేయనున్నారు. భద్రాచలం రాలేని భక్తులకు దేవస్థానం ఆన్​లైన్​ ద్వారా పరోక్ష పూజా కార్యక్రమాలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: దోసకాయ లేదా రోజ్ వాటర్ ఏ టోనర్‌ మంచిది..?

ప్రసాదాల కొరత రాకుండా 2 లక్షల లడ్డూలు, 10వేల పెద్ద లడ్డూలను తయారు చేయిస్తుం ది. ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేటు ప్రసాదాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే  కలెక్టర్​ఆదేశించారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్​రాజ్​, ఏఎస్పీ విక్రాంత్ ​కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment