/rtv/media/media_files/2025/04/06/urzZHql3SFvhMe9iZt9b.jpg)
Sri Rama Navami Shobha Yatra
Sri Rama Navami Shobha Yatra : హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. కాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఈ శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.
Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం