గత కొన్ని నెలల క్రితం మల్లా రెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు ఘటన బయటపడిన విషయం తెలిసిందే. అదే తరహా సంగారెడ్డిలో మరో గర్ల్స్ హాస్టల్ బెడ్ రూమ్‌లో స్పై కెమెరాలు కలవరం రేపాయి. కిష్టారెడ్డి పేట పరిధి మైత్రి విల్లాస్‌లోని లేడీస్ హాస్టల్‌లో నిర్వాహకుడు స్పై కెమెరా ఏర్పాటు చేశాడు. స్పై కెమెరాకి ఓ మెమెరీ కార్డ్ అటాచ్ చేసి వీడియోస్ అన్నీ అందులో స్టోర్ చేశాడు.
బండారు మహేశ్వర్ అనే వ్యక్తి విల్లా నంబర్ 75లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌ను నడుపుతున్నాడు. ఆ హాస్టల్‌లో 30 మంది అమ్మాయిలు ఉంటున్నారు. శుక్రవారం విద్యార్థినీలు హాస్టల్‌లో స్పై కెమెరాను గుర్తించారు. హాస్టల్‌లో ఉంటున్న యువతుల ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పరిశీలిస్తున్నారు. మెమొరీ కార్డ్‌లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. హాస్టల్‌లో ఉంటున్న యువతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.