Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. ఆ యూనివర్సిటీ నుంచి నోటీసులు..?

తెలంగాణ IAS అధికారిణి స్మితా సబర్వాల్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. CMOగా ఉన్నప్పుడు ఆమె 90 నెలలు కారు రెంట్‌కు తీసుకున్నారు. దానీ అద్దె నెలకు రూ.63వేలు జయశంకర్ యూనివర్సిటీ నుంచి కట్టించారట. కట్టిన రెంట్ తిరిగి ఇవ్వాలని ఆమెకు నోటీసులు పంపనున్నారు.

New Update

తెలంగాణ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ మీద ఓ అవినీతి ఆరోపణ వినిపిస్తోంది. తర్వలో ఆమెకు ఓ యూనివర్సిటీ అధికారులు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓగా పని చేసినప్పుడు ఆమె ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. 2016 నుంచి 2024 మధ్య 90నెలల పాటు ఆ కారుకు ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించారు. ఆ కారు నెలకు రెంట్ రూ.63 వేల రూపాయలు తీసుకున్నారు. ఇటీవల జయశంకర్ యూనివర్సిటీ అడిట్ విభాగంలో లెక్కలు చూడగా.. కారు అద్దెకు తీసుకోవడం వర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనం అద్దె కింద తీసుకున్న డబ్బులు చెల్లించాలంటూ వర్సిటీ అధికారులు అంటున్నారు.

Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది

స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్‌ 08 ఈసీ 6345 వాహనం నాన్‌ టాక్స్‌ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ప్రైవేటు వ్యక్తిగత వాహనం పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంవో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. ఈ విషయం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, న్యాయనిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వర్సిటీ  వీసీ పేర్కొన్నారు. 

Also read: SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR  : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ…

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు

New Update
 Ktr Write A Letter On Kancha Gachibowli Forest

Ktr Write A Letter On Kancha Gachibowli Forest

KTR  : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా, ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని, పర్యావరణం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.అందరం కలిసి చేసి ఈ ఉద్యమంలో 400 ఎకరాల పచ్చదనాన్ని, 734 జాతుల పుష్పించే మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం అయిన ప్రకృతిని కాపాడమని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!


ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను, మన సమిష్టి భవిష్యత్తు పట్ల మనకున్న ఆందోళనను పంచుకునే తోటి పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని రక్షించడానికి తమ స్వరాన్ని పెంచిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్ట్, ప్రజా వ్యక్తి, పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తున్నా, నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం దీనికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారి మాదిరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసం, బెదిరింపు ధోరణిలో ఏకో పార్క్ ఏర్పాటు అంటూ, ఫోర్త్‌ సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ తరలింపు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడి వరకూ పక్కా కుట్రతో మాట్లాడుతున్న మాటలను కేటీఆర్ తన లేఖలో ఎండగట్టారు. 50 సంవత్సరాలకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ ప్రాపగండ చేస్తున్న ఏకో పార్క్ కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్‌గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. విద్యార్థుల పోరాటం ఫలించి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన పర్యావరణ హత్యను అడ్డుకున్నదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ పోరాటం పూర్తిగా అయిపోలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలి ఉందని, ప్రభుత్వ కుట్రలను, బెదిరింపులను, దుష్ప్రచారాన్ని దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలియజేశారు. ఈ పోరాటానికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.  

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇప్పటికే మా పార్టీ తరఫున 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా బి ఆర్ ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణం కోసం 400 ఎకరాలను వేలం వేసే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటున్నట్లు వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Advertisment
Advertisment
Advertisment