SLBC టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల బృందాలు ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరం చేరుకున్నారు. శిథిలాలు, TBM మెషిన్ భాగాలను బయటకు తీసుకొస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం వరకు మరో ఇద్దరు కార్మికుల ఆచూకీ తెలుస్తోందని అధికారుల తెలిపారు.
Also read: Mom sit on son: ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా
ప్రమాద స్థలంలో 20 మీటర్ల మేరా సొరంగం కుంగింది.. దీంతో కార్మికులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రోబోలను రంగంలోకి దించింది. మద్రాస్ ఐఐటీ నుంచి ఓ టెక్నికల్ టీం రోబోలతోపాటు సొరంగంలోకి వెళ్లారు. శిథిలాలు, మట్టి, బురదను రోబోలు లోకో ట్రైన్‌లో డంప్ చేయనున్నాయి. కాగా నిన్న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
Also read: girl water fasting: ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?