SLBC: సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం.. SLBC ఘటనపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్!

ఎస్ఎల్‌బీసీ సొరంగం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ అన్నారు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం బాధకరమన్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమంటూ హరీష్ రావు సైతం మండిపడ్డారు. 

New Update
rev ktr

SLBC: ఎస్ఎల్‌బీసీ సొరంగం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ అన్నారు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం బాధకరమన్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమంటూ హరీష్ రావు సైతం మండిపడ్డారు. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

మధ్యాహ్నం వరకు చలనం లేదు..

నాలుగు రోజులు క్రితమే మొదలయిన SLBC టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదాన్ని దాచిపెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రమాదం పొద్దున 8:30 గంటలకు జరిగితే మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో కూడా తెలియని స్థితిలో యంత్రాంగం ఉంది. సీపేజ్ వచ్చింది, అందుకే కూలింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం హాస్యాస్పదం. సీపేజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు పాటించాలేదని ప్రశ్నించారు.

Also Read: Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు..

అలాగే సుంకిశాల ప్రమాదంలా దాచిపెట్టే ప్రయత్నం చెయ్యకుండా ఇప్పటికైనా ఎంతమంది కార్మికులు లోపల ఇరుకున్నారో చెప్పాలన్నారు. వారిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: Shashi Tharoor: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు.. పార్టీపై శశిథరూర్‌ తీవ్ర అసంతప్తి!

 ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ ను కాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపైనైనా పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలన్నారు. 

Also Read: Free Chicken: హైదరాబాద్‌లో ఫ్రీగా చికెన్, ఎగ్స్.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?

ఇక హారీష్‌ రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదే. మొన్న సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిన ఘటన, నేడు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నదనీ గుర్తించినప్పటికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.

ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తుంది. 
వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. డీ వాటరింగ్ చేసి, వెంటనే విద్యుత్ పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు