Toll tenders : బీఆర్ఎస్ టోల్ టెండర్లపై సిట్

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని రేవంత్‌ సర్కార్‌ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ ఫార్ములా కారు రేసింగ్‌లపై విచారణ చేపట్టింది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

New Update
Toll tenders

Toll tenders

Toll tenders :  పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని రేవంత్‌ సర్కార్‌ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ ఫార్ములా కారు రేసింగ్‌ ఇలా నాటి ప్రభుత్వం పథకాలన్నింటిపై విచారణ చేపట్టింది. అయితే అన్ని కూడా విచారణ దశలోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వ చర్యలపై రోజుకోతీరు ఉద్యమిస్తున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ ఇవ్వకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించలేమని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. దీంతో కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు మరోపావును కదపడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

ఇప్పటికే ఈ ఫార్ములా రేసులో కేటీఆర్‌ను కోర్టుచుట్టూ తిప్పుతున్న రేవంత్‌ ప్రభుత్వం ఆయనకు మరో షాక్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ లీజు.. టోల్ టెండర్ల వ్యవహారంపై  రేవంత్‌ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందులో అక్రమాలు జరిగాయని, వాటిని నిగ్గు తేల్చాలనుకుంటోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు  చేయాలని భావిస్తోంది. టోల్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది.  దీనిపై  ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌  ఏర్పాటు చేస్తామని సీఎం  రేవంత్‌రెడ్డి గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలోని ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో ‘సిట్‌’ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Also Read: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం

ఒకవైపు గత ప్రభుత్వంలోని అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు ఏ మాత్రం వెనుకకు తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ కు ఫస్ట్ చెక్ పెట్టే ప్రయత్నం చేసినా కానీ అది  పెద్దగా ప్రయోజనం దక్కలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ వైపు రావడానికి ఇష్టపడలేదు. మరోవైపు కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే  సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును తేల్చడానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది. దీంతో ఇప్పట్లో ఈ కేసు తేలే అవకాశం లేదు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అందుకే బీఆర్‌ఎస్‌ను ముఖ్యంగా కేటీఆర్‌ ను కట్టడి చేసేందుకు టోల్‌ టెండర్లపై సిట్‌ వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

Advertisment
Advertisment
Advertisment