/rtv/media/media_files/2025/04/02/aaa9C5w9oTIeeQ0GYq16.jpg)
supreme court of india
Supreme Court : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంబంధిత ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగేళ్లు ఎలాంటి చర్యలు తీసుకోకున్నా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ కి కోర్టులు సూచనలు చేసే అంశంపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించిన ముకుల్ రోహత్గి. తాము మొదటి నుంచి స్పీకర్ ఎంత కాలంలో నిర్ణయం తీసుకోగలరో చెప్పాలని కోరుతున్నామన్న జస్టిస్ గవాయ్.ఇటివల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాటలను ప్రస్తావించిన కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం. ఉప ఎన్నికలు రావు, సభ్యులు ఎవరూ కంగారు పడాల్సిన, ఆనంద పడాల్సిన అవసరం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించిన సుందరం. స్పీకర్ నిర్ణయానికి, సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేదని కొట్టిపారేసిన రోహత్గి.
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తగిన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టులో ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం వాదనలు ముగిశాయి. తాజాగా స్పీకర్ తరఫున రోహత్గీ వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు!
‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశముంటుంది. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు. అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా అని ప్రశ్నించారు. అనంతరం రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రోహత్గీ అన్నారు. ‘‘2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు’’ అని కోర్టుకు తెలిపారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
సరైన సమయం అంటే మీ దృష్టిలో ఎంత కాలం అని జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ ప్రశ్నించారు . అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని ముకుల్ రోహత్గి.సమాధానం ఇచ్చారు. ముకుల్ రోహత్గి వాదనలు ముగియడంతో రేపు అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపిస్తా అన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి తెలిపారు. రేపు ఉదయం 10.30గం.లకు ధర్మాసనం సమయం కేటాయించింది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ వాదనలు వినిపిస్తున్నారు.
also read : Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!
#SupremeCourt to hear today BRS MLAs' pleas against Telangana Assembly Speaker's delay in deciding disqualification petitions in respect of party MLAs who defected to the ruling Congress
— Live Law (@LiveLawIndia) April 2, 2025
Bench: Justices BR Gavai and AG Masih pic.twitter.com/2ChoYKEXSU