Sub-Registrar Employees : ఆ ఉద్యోగులకు షాక్.. ఉగాది సెలవులు రద్దు

ఉగాది పండుగపూట సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు  ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
sub-registrar office

sub-registrar office

Sub-Registrar Employees :ఉగాది పండుగపూట సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు  ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు(ఆదివారం), ఎల్లుండి(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్ఎస్ ఫీజు  మార్చి 31వ తేదీలోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ  ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మార్చి 30, 31వ తేదీలు సెలవు దినాలు కావడంతో చెల్లింపులు జరుపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

మరోవైపు.. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులోనూ 25% రాయితీ ఇస్తోంది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. రిజిస్ట్రార్ కార్యాలయాలు మార్చి 29, 30,31 తేదీలలో తెరిచి ఉంటాయి. అన్ని పత్రాలు సాధారణ పని దినాల మాదిరిగానే నమోదు చేయబడతాయని ప్రకటించింది.

Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఏపీలోనూ...


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఈ నెల 30 (ఆదివారం), 31 (సోమవారం) తేదీల్లోనూ పని చేస్తాయని తెలిపింది. ఈ రెండు రోజులూ ప్రభుత్వ సెలవు దినాలైనా సరే.. ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు యథావిధిగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేస్తారని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని.. రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చన్నారు.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

'2024-2025ఆర్ధిక సంవత్సరం ముగింపుతో మార్చి 30, 31 సెలవు దినాల్లో కూడా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టాంపులు & రిజిస్ట్రేషన్ కమిషనర్ అందించిన నివేదిక నేపథ్యంలో.. ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన అనంతరం తీసుకుంది. ఉత్తర్వుల ప్రకారం, పై కార్యాలయాలు మార్చి 30 & 31 తేదీల్లో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ స్టాంపులు , రిజిస్ట్రేషన్ కమిషనర్ & ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి' అని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్, డిప్యటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పనిచేస్తాయి. వాస్తవానికి ఈ నెల 30, 31న సెలవు దినాలు.. 30 ఆదివారం కాగా, 31న రంజాన్ కావడంతో సెలవులు.. కానీ ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ప్రభుత్వం కార్యాలయాలు పనిచేస్తాయంటున్నారు. దీంతో రెండు రోజుల పాటూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడకుండా కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఊరట కలిగించిందనే చెప్పాలి.

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు