/rtv/media/media_files/2025/03/10/Hvfkc0FrY0LYPsXUg7yZ.jpg)
vijaya shanthi
Vijayashanti : కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలుంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావుడి చేస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.విజయశాంతి విషయంలోనూ అదే జరిగింది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు : కేటీఆర్
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్ఠానం నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు.
ఇది కూడా చదవండి: Addanki Dayakar: ఎట్టకేలకు దక్కిన ఫలితం.. MLC దక్కించుకున్న అద్దంకి ప్రస్థానమిదే!
అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతోంది. సరే మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలిక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్ఠానమే ఖరారు చేసింది.
Also Read : రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా తక్కువగా ఉన్నారనీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ ఐనా కేటీఆర్, హరీష్ ల విమర్శలకు దీటుగా బదులిస్తున్న దాఖలాలు లేవనీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు.
Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా రంగాన్ని శాసించిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడారు. ఈ క్రమంలో తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో కూడా చేరారు. ఎంపీగా పని చేశారు. ఇప్పుడామె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపీకయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరినా టికెట్ ఆశించలేదు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కోసం పట్టుబట్టలేదు. కానీ అనూహ్యంగా ఈ రోజు అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
మరోవైపు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ కు విజయశాంతితో మంచి సంబంధాలున్నాయి. మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఇద్దరూ 2009-14 మధ్య ఎంపీలుగా పనిచేశారు. అప్పుడు పార్టీ వాయిస్ ను లోక్ సభలో బలంగా వినిపించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి గురించి ఆరా తీశారు. ఆమె సేవలు వాడుకోవాలని పీసీసీకి సూచించారు. దీంతో విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం ఖాయమనే ప్రచారం జరిగింది. అన్నట్లుగానే ఓబీసీ కోటాలో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఇక మిగిలింది కేబినెట్ లోకి తీసుకోవడం. విజయశాంతి లాంటి వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.
Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్!