/rtv/media/media_files/2025/04/09/jnklW5WLiRhl3WhKqC1U.jpg)
Basara IIIT
బాసర : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాసరలోని త్రిపుల్ ఐటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీచింగ్ కాకుండా తాము అదనపు బాధ్యతలు చేయలేమంటూ వీసీకి రాజీనామాలను సమర్పించారు.తెలంగాణ ప్రభుత్వ జీవో 21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అదనపు బాధ్యతలను స్వీకరించలేమని తేల్చిచెప్పారు.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్ తో పాటు పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అయినప్పటికీ, వారి సేవలకు గుర్తింపు లేకపోవడమే కాకుండా, క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తాము న్యాయమైన డిమాండ్లను సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ స్పందన శూన్యం. ఈ పరిస్థితుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించడం అన్యాయం. అందుకే ఈ రాజీనామా ఒక్కటే మాకు మిగిలిన మార్గం. అని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
కాగా గత కొన్ని రోజులుగా బాసర త్రిపుల్ ఐటీలో వరుస సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.గతంలో విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. మరోసారి క్యాంటీన్ సమస్యపై ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపింది. తాజాగా కాంట్రాక్టు అధ్యాపకులు రాజీనామాలు చేయడంతో పరిణామాలు ఎటు దారితీస్తాయోననే సందిగ్ధంలో విద్యార్థులున్నారు.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి