Allu Arjun : టాలీవుడ్‌లో సంచలనం...రాజకీయాల్లోకి ఐకాన్‌ స్టార్‌?

సినిమా రంగానికి, రాజకీయాలకు ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది.

New Update
allu arjun awards

Allu Arjun

Allu Arjun : సినిమా రంగానికి, రాజకీయాలకు ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఎంతోమంది నటీనటులు ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి సఫలీకృతులైన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడం, తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ పార్టీ పెట్టి యాక్టివ్ అవ్వడం చూసిన తర్వాత ఇండస్ట్రీలోని మరికొందరు స్టార్ హీరోలకు కూడా పాలిటిక్స్ పై ఆసక్తి పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ పొలిటికల్ ఎంట్రీ కోసం కొందరు కథానాయకులు ఇప్పటి నుంచే తెరవెనుక ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది. అచ్చం తమిళ నటుడు విజయ్ అనుసరించిన వ్యూహాన్నే బన్నీ కూడా ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ ఇటీవల కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినప్పటికీ, ఆయన రాబోయే 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ఒక దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు గట్టిగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

దళపతి విజయ్ తరహాలోనే అల్లు అర్జున్‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అత్యంత బలమైన అభిమాన సంఘాల నెట్‌వర్క్ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో బన్నీ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే, ఈ క్షేత్రస్థాయి అభిమాన బలం ఆయనకు ఒక అజేయమైన పునాదిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులను ఓటర్లుగా మార్చుకునే వ్యూహంతోనే ఈ పావులు కదులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ తన తదుపరి భారీ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆయన లైన్లో మరో రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరవేగంగా వైరల్ అవుతున్న ఈ పొలిటికల్ ఎంట్రీ వార్త కేవలం పుకారు మాత్రమేనా.. లేక దీని వెనుక నిజంగానే ఏదైనా బలమైన వ్యూహం ఉందా అనేది స్పష్టమవ్వాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. గతంలోనూ ఇలాంటి వార్తలు వైరల్‌గా మారిన సమయంలో ఆయన టీమ్‌ దీన్ని పూర్తిగా ఖండించింది. మరీ ఇపుడు ఏమాంటారో వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు