Big Breaking : పోక్సో కేసులో సంచలనం...బండి భగీరథ్‌కు పోలీస్ కస్టడీ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడిని విచారించేందుకు మల్కాజిగిరి పోక్సో ప్రత్యేక కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
FotoJet (19)

Bandi Bhagirath

Bandi Bhagirath : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడిని విచారించేందుకు మేడ్చల్‌/మల్కాజిగిరి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16వ తేదీ రాత్రి పెట్ బషీరాబాద్ పోలీసుల చేతిలో అరెస్టయి ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న భగీరథ్‌ను పోలీసులు త్వరలోనే తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ఈ తుది నిర్ణయం తీసుకుంది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానంటూ బెదిరించాడనే బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను బట్టి పోలీసులు నిందితుడిపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠినమైన సెక్షన్లను నమోదు చేశారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు రహస్య వాంగ్మూలాన్ని (Statement) కూడా పోలీసులు రికార్డు చేశారు.

ఈ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణలో ప్రధానంగా డిజిటల్ ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దృష్టి సారించనుంది. నిందితుడి మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాట్లు మరియు కాల్ డేటాను డిలీట్ చేసినట్లు వస్తున్న అనుమానాలపై పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. బాధితురాలికి, నిందితుడికి మధ్య జరిగినట్లు చెప్తున్న సోషల్ మీడియా సంభాషణలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఈ విచారణ ద్వారా కేసులోని మరిన్ని నమ్మశక్యమైన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు ఈ కేసు చుట్టూ ఇరువర్గాల నుంచి పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తూ రాజకీయంగానూ వేడి పుట్టిస్తున్నాయి. తాము ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, న్యాయం కోసమే ధైర్యంగా ముందుకు వచ్చామని, తమపై తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను నిందితుడి వర్గం పూర్తిగా ఖండించింది. రూ. 5 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ ఎదుటి పక్షం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిందని, దానికి లొంగకపోవడంతోనే ఈ తప్పుడు కేసు పెట్టారని వాదిస్తూ.. దీనిపై కరీంనగర్‌లో తాము ముందే కౌంటర్ ఫిర్యాదు చేశామని భగీరథ్ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు