Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్‌ నోటీస్‌

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్‌కార్నర్ నోటీస్‌ జారీకావడంతో కేంద్ర హోంశాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు.

New Update
 Phone Tapping Case |

Phone Tapping Case

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్‌కార్నర్ నోటీస్‌ జారీకావడంతో కేంద్ర హోంశాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్‌కార్నర్ నోటీస్‌ జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారమిచ్చే పనిలో పోలీసులు నిమగ్న మయ్యారు. ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకు, సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది. వీలైనంత తొందరగా నిందితులను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతోపాటు, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు.

Also Read:  USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

డీహెచ్ఎస్‌కు సమాచారం అందగానే అమెరికాలో పొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే తమ ప్రొవిజనల్ అరెస్ట్‌ను అక్కడి న్యాయస్థానంలో వారు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ కక్షసాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ నిందితులు పిటిషన్ దాఖలు చేసినందున అక్కడి కోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

Phone Tapping Case

ఒకవేళ అక్కడ ఊరట లభించకపోతే మాత్రం డిపోర్ట్ చేయడం ఖాయం. అప్పుడు వారిద్దరిని అమెరికా నుంచి విమానంలో భారత్‌కి తిప్పి పంపనున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై అన్ని విమానాశ్రయాల్లో లుక్ అవుట్ సర్క్యులర్‌ జారీ అయి ఉన్నందున వారిని విమానాశ్రయంలోనే ఆపి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. వారిద్దరిని హైదరాబాద్‌కు రప్పించగలిగితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. వైద్యచికిత్స నిమిత్తం అమెరికాలోని ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ప్రభాకర్‌రావు మియామిలో ఉన్నట్లు శ్రవణ్‌రావు గతంలో కోర్టుకి సమాచార మిచ్చారు. అధికారులకు సహకరిస్తామని చెప్పి అనంతరం మొహం చాటేయగా దర్యాప్తునకు సహకరించకుండా నిందితులిద్దరు విదేశాలకి పారిపోయారని పోలీసులు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలకి నివేదిక పంపి ఆ ఇద్దరి పాస్‌పోర్టును ఇప్పటికే రద్దు చేయించారు. విచారణకు హాజరుకాకుండా తప్పించు కున్నందుకు ప్రకటిత నేరస్థులుగా గుర్తించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే రెడ్‌కార్నర్ నోటీస్‌ జారీకావడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

 కేసులో ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీస్‌ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న సహా విశ్రాంత ఓఎస్డీ రాధాకిషన్‌వు వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులే కీలక నిందితులుగా చెప్పినందున వారిద్దరిని విచారిస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వెనకున్న సూత్రధారుల్ని కనిపెట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుడే ఈ అక్రమ వ్యవహారం వెనక రాజకీయపెద్దల ప్రమేయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు