BIG BREAKING: రేవంత్‌ పోవాలే.. కేసీఆర్‌ రావాలి.. జగిత్యాల సభలో గర్జించిన జీవన్‌ రెడ్డి

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తాజాగా జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకున్నారు.

New Update
Jeevan Reddy

Jeevan Reddy

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తాజాగా జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలకు కూడా కేసీఆర్.. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన జీవన్‌ రెడ్డి చివరికి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రైతు భరోసా నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అభివృద్ధికి రాజకీయాలు లేవన్నారు. రాష్ట్రంలో జిల్లాలను పెంచి, రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనంటూ కొనియాడారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతేనే బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారని.. SLBC టన్నెల్‌ కూలి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. 

Advertisment
తాజా కథనాలు