/rtv/media/media_files/2025/02/20/eCjcWHynKPbfK6c59igN.png)
drugs and ganja
Seized drugs : ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కట్టడి చేసిన డ్రగ్స్ అమ్మకాలు మాత్రం అరికట్టలేకపోతుంది. డ్రగ్స్ విక్రయదారులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చ విదేశీయులు డ్రగ్స్ అమ్మకాల్లో ముందుంటున్నారు. వారి ద్వారా స్థానికంగా అమ్మకాలు సాగించేవారికి డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. కాగా ఈ రోజు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది.
Also Read: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?
హైదరాబాద్‌లో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (TGANB), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో 6 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది. ఈ తనిఖీల్లో అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్ బెంగళూర్‌కు చెందిన శతాబ్ది మన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద రూ.6 లక్షల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగో పరారీ అయ్యాడు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!
బుధవారం TGNAB, సైబరాబాద్ మియాపూర్ పోలీసుల వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపారని చెప్పారు. బెంగళూర్ నుంచి వచ్చిన మహిళ శతాబ్ది మన్న (24) వద్ద 60 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెంగుళూరులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన శతాబ్ది మన్నాకు అక్కడే ఆఫ్రికాకు చెందిన విద్యార్థి వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శతాబ్ది దాన్ని అధిక మించడానికి డ్రగ్స్ సరఫరాకు ఒప్పుకుందన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.
శతాబ్ది MDMA డ్రగ్ డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌కు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. నిందితురాలు వద్ద రూ.6 లక్షల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌పై గట్టి నిఘా పెట్టామని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
300 కేజీల గంజాయి పట్టివేత
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఈ రోజు అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. మహేశ్వరం ఎస్ వోటీ, అబ్ధుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. దీని ధర సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also Read: కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో!
Also Read: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు