/rtv/media/media_files/2025/01/11/RfCSdE1UBoRgVM7sIA28.jpg)
Sankranti buses Photograph: (Sankranti buses)
సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి ఊరెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీజీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. పోనీ రైళ్లలో వెళ్లాలి అనుకుంటే ఛార్జీ ధరలు అందుబాటులోఉన్నా.. రద్దీ ఫుల్ గా ఉంది. మూడు నెలల కిందటే సీట్లన్ని బుక్ అయిపోయాయి. 162 స్పెషల్ రైళ్లను నడుపుతన్నప్పటికీ రిజర్వేషన్‌లో సీటు దొరకడం లేదు. దీంతో చాలామంది జనాలు ప్రైవేటు ట్రావెల్స్ లనే నమ్ముకున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకోని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పొంగల్ దోపిడీ షురూ చేశారు. రేట్లు ఆమాంతం పెంచేశారు. ధరలుల చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. ప్రస్తుతం రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. మాములుగా అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 1000 ఛార్జీ ఉంటుంది. ఇక వైజాగ్ కు అయితే తక్కువలో తక్కువ రూ. 2 వేలు ఉంటుంది. కానీ ఈ ప్రైవేటు ట్రావెల్స్ లో ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే త్రిబుల్ ఛార్జీలు పెట్టుకోవాల్సిందే. ఇక ఫ్యామిలీతో ఇంటికి వెళ్లాలంటే సామాన్యుడు అయితే నెల జీతం ఖర్చు చేయాల్సిందే. ఇక హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే సుమారుగా రూ. 4 వేలుగా ఛార్జీలున్నాయి. దీంతో పండగ పుణ్యామా అని మూడు పువ్వులు ఆరు కాయాలు అన్నట్లుగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులకు వ్యాపారం సాగుతోంది. ఇక విమాన ఛార్జీల విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.14వేలకు పైనే ఉండగా.. అదే రాజమండ్రికి రూ.22 వేలు ఉంది.
సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్‌ఆర్టీసీ స్పెషల్ గా 6 వేల 432 బస్సులను నడుపుతుండగా.. ఏపీఎస్‌ఆర్టీసీ 7 వేల200 బస్సులను నడుపుతున్నట్లుగా వెల్లడించాయి. అయితే పండగను క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇంటికెళ్లే వారికి శుక్రవారం నుంచి బస్సు టికెట్ ధరలను అమాతంగా ఒకటిన్నర శాతం పెంచేసింది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ఎలాంటి ఛార్జీలు పెంచకుండా . సాధారణ ఛార్జీలతోనే నడుపుతుండటం ఊరటనిస్తుంది కానీ డిమాండ్‌కు తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్