/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
road accident in Suryapet
TG Crime: సూర్యాపేట జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం ఓ ఆటోను ఓవర్ టెక్ చేయబోయి ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇద్దరు స్పాట్ డెడ్...
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్, బొజ్జగూడ తండా సమీపంలో నీళ్ల ట్యాంకర్‌ను ఇన్నోవా కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేళ్లచెరువు మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ, ఉపేందర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి నలుగురు పని కోసం ఖమ్మం వెళ్లి కోదాడకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం కోదాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులలో వాటర్ ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లను కొడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
ఒక్కసారిగా ట్యాంకర్ ముందుకు మూవ్ ఇవ్వడంతో వెనక నుండి కారు వచ్చి ఢీకొనట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అక్కడికక్కడే సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ మృతి చెందారని.. ఉపేందర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కోదాడ ప్రభుత్వా్స్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరిది తప్పు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?
(ts-crime | ts-crime-news | latest-news | telugu-news)