హైదరాబాద్‍కు ఆ పరిస్థితి రాకుండా చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

New Update
CM

ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంభై, కలకత్తా, బెంగళూర్ సిటీల పరిస్థితి బాలేదని.. అక్కడ నీరు, గాలి, భూమి అంతా కాలుష్యమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా చేయాలని ఆయన చెప్పారు. ఆ నగరాలకు జరిగిన దాన్ని చూసి మనం అనుభవాలు నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో రూ.3500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి.

న్యూయార్క్, టోక్యోలతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ఇంకా అభివృద్ధి చేసి విశ్వ నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. హైరాబాద్ అభివృద్ధి కోసం ఉపముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబద్ బ్రాండ్ దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పి.. మోదీ మాట తప్పారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ సిటీలో డ్రైనేజీలు కూడా తీయలేదని రేవంత్ రెడ్డి విపక్షాలపై విరుచుకుపడ్డారు. గుజరాత్ లాగా హైదరాబాద్ కావద్దా అని ప్రధానిని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. హైదరాబాద్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

రాష్ట్రానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 60 శాతం ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది కాంగ్రెస్‌ పార్టేనని చెప్పారు. గతంలో హైటెక్ సిటీ అభివృద్ధిని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారనన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కూడా హైదరాబాద్ డెవలప్ మెంట్ ను కొనసాగించారని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.3500 కోట్లతో  రోడ్లు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల ముందు కొందరు ఫొటోలు దిగుతూ డబ్బాలు కొడుతున్నారని సెటైర్లు వేశారు.

ఇది కూడా చూడండి:  YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

Also Read: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ..

Advertisment
Advertisment
తాజా కథనాలు