Telangana: తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి, చలి బాగా వణికిస్తుండగా.. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Hollywood: మీరంతా నిజమైన హీరోలు.. కార్చిచ్చు పై ప్రియాంక పోస్ట్!
చలి నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. జనవరి 18 వరకు చలి తీవ్రత తక్కువగా ఉంటుందని IMD హైదరాబాద్ అంచనా వేసింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తున్న వేళ హైదరాబాద్ నగరవాసులకు ఇది కాస్త వేడిని ఇచ్చే మాటే.
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని IMD హైదరాబాద్ చెప్పింది. కుమురం భీమ్ జిల్లాలో రెండు రోజుల క్రితం 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లోనూ కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో శనివారం వరకు ఉష్ణోగ్రతలు స్పల్పంగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
Also Read: Sperm Donor: 87 మంది పిల్లలకు తండ్రి.. ప్రతి దేశానికి ఓ బిడ్డను పుట్టించాలని ప్లాన్
జనవరి 18 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD హైదరాబాద్ అంటుంది. అయితే, ఉదయం వేళల్లో పొగమంచు, మబ్బుగా ఉండే పరిస్థితులు కొనసాగుతాయని వివరించింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం పొడి వాతావరణం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.
మన్యం జిల్లాలో...
ఇదిలా ఉంటే ఏపీలోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చలి వణికిస్తోంది. జి.మాడుగులలో రెండు రోజుల క్రితం 10.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జీకే వీధి, డుంబ్రిగూడలో 11.3, చింతపల్లిలో 11.5, అరకు లోయలో 12.0 పాడేరులో 13.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో గత 15 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పదిన్నర గంటల వరకు దట్టంగా కురుస్తున్న పొగమంచు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.
Also Read: Mahakumbh: యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్!