/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వీళ్లిద్దరూ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ఇద్దరినీ BRS ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పెండింగ్‌లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసు పెండింగ్‌లో ఉంది.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలసిందే. బీఆర్‌ఎస్ 39 స్థానాలకే పరిమితమయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొంత కాలానికి బీఆర్‌ఎస్ నుంచి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వీళ్లలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. వీళ్లందరిపై 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం' కింద వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు.
Also Read: తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు ?
మరోవైపు తాము ఎవరినీ బలవంతంగా చేర్చుకోవడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం వారే వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి తీసుకున్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వాస్తవానికి అనర్హతపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు ఉంటుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు. అందుకే అధికార పార్టీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.
తాజాగా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పీకర్ గడ్డ ప్రసాద్ స్పష్టం చేశారు. వాళ్లు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని తెలిపారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ చేయాల్సి ఉంది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తయ్యింది. కానీ ఈ తీర్పు రిజర్వులో ఉంది. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ చేయనున్నారు. సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడ తీర్పు రాకముందే తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పు వెలువరించారు.
Also Read: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్ పెన్నులు
Follow Us