/rtv/media/media_files/2025/04/01/WRJieWmGQCLemJswyUgt.jpg)
6-Year-Old Girl Raped,
The court's sensational verdict : కళ్లముందు ఎంతటి ఘోరం జరుగుతున్నా..మనకెందుకులే అని చూసీ చూడనట్టూ వెళ్తుంటాం. కానీ ఓ యువ వస్త్రవ్యాపారి మాత్రం అలా అనుకోలేదు. ఆ బాలికను కాపాడడమే కాకుండా నిందితునికి శిక్షపడేంత వరకు వదిలిపెట్టలేదు. రెండేళ్లక్రితం జరిగిన ఈ దారుణ ఘటనలో ఇటీవలె కోర్టు తీర్పు వెలువరించింది. నిందితునికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
విషయంలోకి వెళ్తే అది 7జూన్ 2023..హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతం. షాప్ తీసేందుకు ఉదయమే యువ వస్త్ర వ్యాపారి తాళాలతో షాప్‌కు వచ్చాడు.ఇంతలో కొద్దిదూరం నుంచి ఒక చిన్నారి అరుపులు వినవచ్చాయి. ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆతర్వాత ఆమె గొంతుపై కాలుపెట్టి చంపేందుకు ట్రై చేస్తున్నాడు. ఇంతలో వ్యాపారి అరుపులు వినవచ్చిన చోటుకు చేరుకున్నాడు. అతన్ని చూసి కామాంధుడు పారిపోయాడు. రక్తపు మడుగులో పడిఉన్న చిన్నారిని చూసిన వ్యాపారి చలించిపోయాడు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన
అయితే చిన్నారికి న్యాయం చేయాలనుకున్న వ్యాపారి ఆమెను రక్షించటమే కాకుండా.. అండగా నిలిచాడు. చిన్నారి కుటుంబ సభ్యులు కేసుకు దూరంగా ఉన్నా.. అతను మాత్రం కామాంధుడిని విడిచి పెట్టలేదు. కోర్టులో సాక్ష్యం చెప్పి నిందితుడికి శిక్ష పడేలా చేశాడు. ఫోక్సో కేసుల ప్రత్యేక కోర్టులో ఈ కేసుపై రెండేళ్ల పాటు విచారణ జరిగింది. గత నెల 21న కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికకు 7 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, బాలిక వాంగ్మూలం, 12 మంది సాక్షుల సాక్ష్యాల ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు శతవిథాలా ప్రయత్నించాడు. బాలిక కుటుంబ సభ్యులు కూడా కేసు నుంచి తప్పుకున్నారు. కానీ, వస్త్రవ్యాపారి మాత్రం పట్టుదలతో కోర్టుకు హాజరయ్యాడు. బాలికకు న్యాయం జరిగే వరకు విడిచి పెట్టలేదు. ఆరోజు అలాంటి పరిస్థితుల్లో బాలికను చూసి తాను చలించిపోయానని సదరు వస్త్రవ్యాపారి కోర్టుకు తెలిపారు. చిన్నారి బాధతో విలవిల్లాడుతూ.. రక్తంతో తడిసిముద్దయి ఏడుస్తూ ఉందన్నారు. తాను చూస్తూ ఊరుకోలేకపోయానని.. ఇది అత్యాచారం కేసు అని ముందు ఊహించలేదని చెప్పారు. ఆ కామాంధుడు బాలికకు ఆహారం కొనిస్తానని మభ్యపెట్టి కాచిగూడ నుండి నల్లకుంటకు తీసుకువచ్చినట్లు చెప్పాడు. అక్కడ మద్యం సీసాతో ఆమెను కొట్టి అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఈ ఘటనపై కేసు విచారణ చేపట్టిన పోలీస్ అధికారి మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారి సహాయం చేయకపోతే పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉండేదని అన్నారు. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేది కాదని చెప్పారు. అతను ఆమె ప్రాణాలను కాపాడటమే కాకుండా.. ఒక కామాంధుడిని జైలుకు పంపినట్లు చెప్పారు. ఆ వ్యాపారి బాలికను కాపాడేందుకు అన్ని విధలా ప్రయత్నించాడని అన్నారు. ఈ కేసులో ఆ వస్త్ర వ్యాపారి చూపిన తెగువ, మానవత్వం ఎంతో గొప్పవని కొనియాడారు. అతను చేసిన సహాయం ఆ చిన్నారికి న్యాయం జరిగేలా చేసిందన్నారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం మన అదృష్టమని దర్యాప్తు అధికారి వెల్లడించారు. అంతా ఆయనలా ఉంటే కేసుల్లో త్వరగా శిక్షలు పడుతాయని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్