/rtv/media/media_files/2025/02/10/0BWNwPASrRjnsXdAK2b7.webp)
Ram Gopal Varma
దర్శకుడు రాంగోపాలవర్మకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ పంపారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికి సీఐడీ అధికారులు రెండుసార్లు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 10న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచారణకు వెళ్ళలేదు. తనకు బదులుగా తన న్యాయవాదిని సీఐడీ ఆఫీస్‌కు పంపించి.. సినిమా పనులతో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు. నిన్న మరోసారి సీఐడీ నోటీసులు పంపించింది.
రాజకీయ కక్షతోనే..
అయితే తాజాగా ఈ నోటీసులపై వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో తన మీద కేసును నమోదు చేశారని...ఆరోపణలన్నీ నిరాధరమైనవని అన్నారు. సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేశాక 2019లో సినిమా విడుదల చేశామని...దానిపై 2024లో కేసు నమోదు చేయడంలో అర్ధం లేదని వర్మ అన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు అన్నీ చెల్లవనీ..వారు తరువాత తీసుకునే చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ హైకోర్టును కోరారు.
Also Read:SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కన్ఫామ్