/rtv/media/media_files/2025/01/19/sdjYLJI2ntNCPuJ5lFVz.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హనుమకొండలో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చాయి.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు https://t.co/h3U0xmtw42 pic.twitter.com/ZZoliJQ030
కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ..
అక్కడి నుంచి ట్రైన్ లో తమిళనాడుకు వెళ్తారని ప్రకటించారు నేతలు. ఓ ప్రైవేటు కార్యక్రమం నేపథ్యంలో వస్తున్నారన్న వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తమ అగ్రనేతకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు సైతం సిద్ధమయ్యారు. అయితే.. ఆఖరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే..?
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దుపై కాంగ్రెస్ వర్గాలు కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ఈ రోజు పార్టీ పార్లమెంట్ లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ హైదరాబాద్, వరంగల్ పర్యటన రద్దు అయినట్లు పేర్కొంది.
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్
మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
High Tension In Tirupati🔴LIVE : తిరుమలలో ఉగ్రదాడి టెన్షన్ | Tight Security In Tirumala | TTD | RTV
Mohammad Rizwan: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఇవే తగ్గించుకుంటే మంచిది!