/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Indian-Students-Died.jpg)
sycho Medchal
TG Crime: మేడ్చల్ జిల్లాలో సైకో రెచ్చిపోయాడు. కనిపించినవారిపై దాడికి తెగబడ్డాడు. అక్కడితో ఆగకుండా పార్క్ చేసి ఉన్న కార్లపై దాడి చేశాడు. సైకో దాడిలో చిన్నారి మృతి చెందింది. పోచారం ఐటీ కారిడార్‌లో శనివారం రోడ్డుపై వెళ్తున్న పలువురిపై సైకో విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరినీ కత్తితో గాయపరిచాడు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. సూర్య ఆస్పత్రి దగ్గర కాసేపు సంచరించిన సైకో జోడిమెట్ల దగ్గర వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాళ్లు, కర్రలు తీసుకుని కార్లపై దాడి చేశాడు.
చిన్నారి తలపై బీరుసీసాతో కొట్టి..
అక్కడి స్థానికులు, కార్ల యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేసినా సైకో ఆగలేదు. ప్యాంట్ జేబులోంచి ఓ కత్తిని తీసి అందరిపై దాడికి పాల్పడ్డాడు. ఘటనలో పలువురు యువకులతో పాటు మహిళలు, చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లేబర్ క్యాంప్‌లో ఆడుకుంటున్న చిన్నారి రియాకుమారిని తలపై బీరుసీసాతో కొట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సైకో దాడిలో రెండు కార్ల అద్దాలతో పాటు ఆటో ధ్వంసమైంది. దాడికి పాల్పడి సైకోను స్థానికులు బంధించి, తాళ్లతో కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఆకుపచ్చ క్యాప్సికమ్ తినాలి
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సైకోని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం బిహార్‌కు చెందిన జగేశ్వర్ భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన హప్నహెమ్‌బ్రూమ్(30) శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా సైకోగా మారి ఇలా దాడులకు పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారు సమాజంలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా సైకో దాడిలో చిన్నారి చనిపోవడం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.
ఇది కూడా చదవండి: ఈ చిట్కాలు పాటిస్తే వయసు పెరిగినా కంటి చూపు తగ్గదు
(ts-crime | ts-crime-news | latest-news)