/rtv/media/media_files/2025/03/10/7sHxiep33K1pT2LDJSDH.jpg)
pranay amrutha case 123 Photograph: (pranay amrutha case 123)
2018లో సంచలనం సృష్టించిన పరువు హత్యకేసులో నల్గొండ ఎస్టీ, ఎస్సీ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అమృత ప్రణయ్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది నిందితులకు గానూ A1 ఉన్న మారుతిరావు చనిపోయాడు. A2 సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా A6గా ఉన్నాడు. ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో శవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు, అమృత తండ్రైన ఏ1 మారుతీ రావులు అన్నదమ్ములు.
ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’.#nalgonda #amruthapranay #case #judgement #amruthasister #RTV pic.twitter.com/IKBquvvZdw
— RTV (@RTVnewsnetwork) March 10, 2025
పోలీసులతో శ్రవణ్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్ కూతురు బోరున విలపించింది. ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఇరికించిందని ఆరోపించింది. దీనికి అంతటికి కారణం అమృతనే అని ఆమె చెల్లి (బాబాయ్ బిడ్డ) ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి నుంచి కూడా శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబం వాదిస్తోంది.
Also read: jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో
ప్రణయ్ మర్డర్ జరిగినప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏపీ రంగనాథ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నేరస్థులకు శిక్ష పడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమృత కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ సంఘటనల 2018 సెప్టెంబర్ 14 జరిగింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈరోజు కోర్టు ఆఖరి తీర్పు ఇచ్చింది.