/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 18 వరకు ఆయనకు రిమాండ్ విధించి, కర్నూల్ జిల్లా జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన ఆదోని అధ్యక్షుడు రేణు వర్మ ఫిర్యాదుపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. పోసానిపై గతేడాది నవంబర్ 14న ఫిర్యాదు చేయడంతో, FIR NO. 119/ 2024 పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై కేసు ఫైల్ చేశారు. అటు తనపై నమోదైన కేసుల్లో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను తర్వగా విచారించాలని క్వాష్ పిటిషన్ వేశారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
Also read : Posani Krishna Murali : పోసానిపై వరుస కేసులు..ఆదోనికి తరలింపు
వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈనేపథ్యంలో.. మంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకు చేరుకొని పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెళ్లారు.
పిటీ వారెంట్ పై ఆదోని లో నమోదు అయినా కేసు మీద గుంటూరు జైలు అధికారులను సంప్రదించిన ఆదోని త్రీ టౌన్ పోలీసులు. ఆయనను రాత్రి ఆదోని కోర్టులో హాజరు పరిచారు. పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 18 వరకు ఆయనకు రిమాండ్ విధించి, కర్నూల్ జిల్లా జైలుకు తరలించారు.