/rtv/media/media_files/2025/02/19/Xp5jGZCvGa8Ro65Bbfy7.jpg)
KCR-Ponnam Prabhakar-Ponguleti
Counter to KCR : చాలాకాలం తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. తక్కువకాలంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా ఖాయమన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్ ఏడాదిలో అమలుచేసిన సంక్షేమ పథకాలు చూసి కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని పొన్నం అన్నారు. ప్రభుత్వం అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. అధికారం కోల్పోయి.. దరిదాపుల్లో మళ్లీ గెలిచే అవకాశం కనిపించక లేకపోవడంతో కేసీఆర్ అక్కసు వెళ్లగక్కారన్నారు. ఈ పదేళ్లు కేసీఆర్ కు అధికారం సాధ్యం కాదన్నారు.
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!
బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిజం మాట్లాడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేక క్యాడర్ ను నిందిస్తున్నారని పొన్నం అన్నారు. ఒక ప్రతిపక్ష నేత ఏడాదిగా ఫామ్‌హౌస్‌లో ఉంటారా అని పొన్నం ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం పాస్‌పోర్టు కోసమే బయటకు వచ్చారని, అందులో భాగంగానే పార్టీ ఈఫీసుకు వచ్చారని అందనూ అనుకుంటున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మఇండ్లు, ఉచిత విద్యుత్, యాభై వేల ఉద్యోగాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు కేసీఆర్ కు కనిపిస్తలేవా.? అని ప్రశ్నించారు. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా సమర్ధవంతంగా పాలన ఇస్తున్నామన్నారు.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటికలలు కంటున్నారు. కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.14 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనబడుతుంది? అని ప్రశ్నించారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ కుంగినప్పుడు గాని, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు గాని ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదు.
Also Read : సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్
శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీవర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానానికి కూడా కేసీఆర్ హాజరుకాలేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సైతం గైర్హాజరయ్యారన్నారు. కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ గారు తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందని గుర్తు చేశారు. విపరీతమైన అప్పులు చేసి నెత్తిమీద మిత్తిల భారం పెట్టిపోయారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఆయనను ఎన్నటికీ క్షమించదని పొంగులేటి అన్నారు. నువ్వు వద్దు, నీ పాలన వద్దూ మహాప్రభో అని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నా ఇంకా వదిలేది లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని పొంగులేటి విమర్శించారు.
Also Read : Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఊరట
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్