/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mehandi-9-scaled.jpg)
mehandi hyd
TG News: నేటి కాలంలో నకిలీ వస్తువులు ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఆరోగ్యానికి హానికరమైన రసాయనాన్ని ఉపయోగిస్తూ వంటనూనె, చాక్లెట్, పాలు, నెయ్యి ఇలా రకరకాలుగా మార్కెట్‌లో నకిలీ వస్తువులను తయారు చేస్తున్నారు. తాజా హైదరాబాద్ నకిలీ మెహందీ కలకలం రేపింది. టప్పాచబుత్రలో తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి ముఠా సభ్యుల గుట్టురట్టు చేశారు. మెహందీని తయారు చేస్తున్న వ్యక్తిని అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
నకిలీ మెహిందీ...
నకిలీ మెహందీని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిన్నారు. కల్తీ మెహిందీపై పక్కాగా సమాచారాన్ని సేకరించి దాడి నిర్వహించారు. అనంతరం తయారీ కేంద్రం నుంచి పెద్ద మొత్తం మెహందీ కోన్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మెహందీని ల్యాబ్‌లో పరీక్షలు జరిపించారు. పరీక్షలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉపయోగించి మెహందీ తయారు చేసినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితునిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రతిరోజు ఈ గింజలు తిన్నారంటే ఎముకలు ఐరన్‌లా మారుతాయి
( tg-news | latest-news | crime news )