/rtv/media/media_files/2025/03/14/RKsLhgrdXyjVW1nuRuh9.jpg)
Pochampally Srinivas Reddy
అయితే, ఫామ్ హౌస్ ను తాను లీజుకి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజు డాక్యుమెంటన్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాగా, లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో.. విచారణకు హాజరుకావాలంటూ మరోసారి గురువారం నాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మొయినాబాద్ పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు అయ్యేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. అయితే.ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ లోని మూడు నాలుగు సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. ఆయనతో పాటు న్యాయవాది, ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి వచ్చినా పోలీసులు లోపలికి అనుమతించలేదు. మొయినాబాద్ పోలీసులు నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరైనట్టు తెలిపిన పోచంపల్లి.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు వివరించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని, ఫామ్‌హౌస్ లీజు వివరాలు అడిగితే చెప్పానని తెలిపారు.ఫామ్ హౌస్ తన అల్లుడు ఫామ్ హౌస్ యొక్క వ్యవహారాలు చూసుకునేవాడని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తన అల్లుడు రమేష్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడని దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగిందన్నారు. వారిపై కేసులు కూడా పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ఒక్కటి తిన్నారంటే వందేళ్లు వచ్చినా వృద్ధులు అవ్వరు..అర్థమౌతుందా?
కాగా ప్రతి నెల మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామ రెవెన్యూ లో ఉన్న ఫార్మ్ హౌస్ లో ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారని, మీడియా మిత్రులు అడగడంతో వాటికి సంబంధించిన వివరాలు నాకు తెలియదని తెలిపారు. లీజుకు తీసుకున్న వారిపై కూడా కేసు పెట్టడం జరిగిందని దానిపై పూర్తి వివరాలు పోలీసులు తెలుపుతారన్నారు. కేవలం తను కేసు పెట్టిన వివరాల మాత్రమే పోలీసులు విచారణ చేశారని దానిపై పూర్తి స్థాయి పేపర్లు,వివరాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
Also Read: ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా