Cold Wave: పంజా విసురుతున్న చలి.. రోజుకు 30-40 న్యూమోనియా కేసులు శీతాకాలం మొదలవ్వడంతో చలి పెరిగిపోయింది. దీంతో న్యూమోనియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే నిలోఫర్ ఆస్పత్రిలో 200 వరకు కేసులు వచ్చాయి. ప్రతీరోజూ ఓపీకి 30-40 మంది వస్తున్నారు. సోమ, మంగళవారం, బుధవారాల్లో 60 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. By B Aravind 30 Nov 2024 | నవీకరించబడింది పై 30 Nov 2024 07:41 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి శీతాకాలం మొదలవ్వడంతో చలి పెరిగిపోయింది. దీంతో న్యూమోనియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే నిలోఫర్ ఆస్పత్రిలో 200 వరకు కేసులు వచ్చాయి. ప్రతీరోజూ ఓపీకి 30-40 మంది వస్తున్నారు. సోమ, మంగళవారం, బుధవారాల్లో 60 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. అంతేకాదు కొందరికి హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ, వెంటిలేటర్ చికిత్సలు అవసరమవుతున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే న్యూమోనియా బాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల వ్యాప్తి చెందుతుంది. Also Read: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు 0 నుంచి 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడి ఉన్న వృద్ధుల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. స్ట్రెప్టోకోకస్, రెస్పిరేటరీ సిన్సిటియర్ వైరస్ (RSV), ఇన్‌ఫ్లూయెంజా వైరస్ న్యూమోనియాకు చాలామంది గురవుతున్నారు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ చేయించారు.. కొండా సురేఖ సంచలనం! ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా లేకపోతే న్యూమోనియా, ఆస్తమా, ఇతర శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చెబుతున్నారు. చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లిపాలకు తాగించాలని, దీనివల్ల న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లను నియంత్రించవచ్చని చెబుతున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. Also Read: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది... Also Read: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ #telangana temperature #Cold winds in TG #telangana #telugu-news #pneumonia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి