/rtv/media/media_files/2025/04/06/JZPf2H3FNMEd1L5FcXWR.jpg)
Ram Charan vs. Allu Arjun
Ram Charan vs. Allu Arjun: గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అయితే ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి నటులు ఏనాడు నేరుగా గొడవపడింది లేదు. ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో...హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు...రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్..డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.
Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల మీదా ఈ ప్రచారం ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. గతంలో సినిమా అభిమానుల మధ్య ఉన్న మంచివాతావరణం ఈమధ్య చెడిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
#AA22 🔥🚀
— SANJU 🚀 (@sanjureddy1425) April 6, 2025
Waiting !! pic.twitter.com/Vx7KixJYoa