/rtv/media/media_files/2025/04/13/fSXu9jWxbfUiJ8daVsbO.jpg)
Waqf Amendement Bill
Waqf Amendement Bill : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు ఆరోపించారు. వక్స్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దశల వారిగా నిరసన చేపడతామని వారు హెచ్చరించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
Palla vs kadiyam : అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను బొచ్చు కుక్క అని విమర్శిస్తోందని అన్నారు.
Palla vs kadiyam
Palla vs kadiyam : "అవును, నేను కుక్కనే. నన్ను నమ్మిన కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దూకే కడియం శ్రీహరి లాంటి గుంట నక్కను మాత్రం కాదు" అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అని ఆయన మండిపడ్డారు.తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!
బీఆర్‌ఎస్ రజతోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని తెలిపారు. అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలో, ప్రజల భూములను కాపాడటంలో రేసు కుక్కలా ఉండి పోరాడతానని పేర్కొన్నారు.
Also Read: నగరంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి ఆ హోటల్‌లో అత్యాచారం!
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన....Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
కేంద్ర ప్రభుత్వము, మావోయిస్టు పార్టి మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల.Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ not present in Meta description
Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Saleshwaram Jathara: : వత్తన్నం వత్తన్నం లింగమయ్యో..అంటూ తెలంగాణ అమర్ నాథ్ యాత్రకు...
ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు జరిగే సలేశ్వర లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్లోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్ను ఆపేందుకు యత్నించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన
Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
SRH Highlights: సన్రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!