/rtv/media/media_files/2025/02/06/dlxEXVjYW3GM7dGDrI5c.jpg)
Palamuru-Rangareddy
Palamuru Ranga Reddy Project : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పలుమార్లు జాతీయ హోదా కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సైతం ప్రయత్నించారు. ఈ క్రమంలో రాష్ట్రం చేసిన విజ్ఙప్తిపై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా.. జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్!
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా
ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడ్వైజరీ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు టెక్నో - ఎకనామికల్ అనుమతుల కోసం 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ కృష్ణా నదీ జలాలపై తలపెట్టిందని అన్నారు. కృష్ణా నది జలాల కేటాయింపు వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేడబ్ల్యూడీటీ -2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)కు అప్పగించామని, ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానం (ట్రిబ్యునల్) పరిశీలనలో ఉందని వివరించారు. అలాగే ఈ ప్రాజెక్టు అనుమతులకు ఇంటర్ స్టేట్ సమస్యలు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. న్యాయవివాదాలు, నీటి కేటాయింపుల అంశం తేలకుండా పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు టెక్నో - ఎకనామికల్ అనుమతులు ఇవ్వలేమని.. అది తేలితేగాని ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లయింది.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మించాలని తలపెట్టారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తి పోయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2013 నాటికి ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద ప్రారంభించిన కేసీఆర్ దాన్ని జాతికి అంకితం చేశారు. అయితే నేడు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించినప్పటికీ జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో రేవంత్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?