/rtv/media/media_files/2025/03/26/kHGo1Fkj6D5I7q9ap9kq.jpg)
Komatireddy Rajagopal Reddy vs ktr
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also read: Man Rapes Goat: నీ కామం తగలెయ్య.. మేకను కూడా వదల్లేదు కదరా..!
కాగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం లేకుండా చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. మీకు నాయకుడే లేడు.. సభకు రావడమే మానేశారని తెలిపారు. ప్రజల సమస్యలు చెప్పడానికి సభకే రావడం లేదు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే నిన్నటి నుంచి ఒకలెక్కా.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉండేది.
Also read: Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్
సైరన్ సప్పుడు లెకుండా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు అందరి ఫోన్లు ట్యాప్ చేసి అధికార దాహానికి బలై పోయారు. అహంకారంతో సాగింది బీఆర్ఎస్ పాలన.. కేసీఆర్ పాలనలో 8 వేల హత్యలు.. లక్ష దొంగ తనాలు జరిగాయి. మేము ఆరుగురం ఉన్నప్పుడు మా గొంతు నొక్కారు. సభ మీ సొంతమా అని అడిగారు. ఇప్పుడు నేను అడుగుతున్న.. సభ మీ సొంతమా మరి.. వచ్చినప్పటి నుండి ఒకటే గొడవ.. బీఆర్‌ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. ఆ టైమ్ ప్రజల కోసం కేటాయిస్తే చాలు అని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?