/rtv/media/media_files/2025/02/24/vFffKboQr4qNR1JZY58a.webp)
minister-komatireddy
SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా సరే టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న భాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకొని వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రమాద ఘటన చాలా విషాధకరమని అన్నారు. ఈ ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని ఎక్కడో చిన్న ఆశ ఉందన్నారు. వారిని రక్షించడమే తమ ముందున్న బాధ్యత అని, కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేస్తే చాలా ప్రమాదం
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం తెలంగాణ ప్రజలనే కాకుండా దేశ ప్రజలందరినీ కలచివేసింది. ఇలాంటి టన్నెల్ దేశంలో ఎక్కడ లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెన్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చుకుంటూ, పుల్ లెవల్ కెపాసిటీ అంటే 6వేల క్యూసెక్కుల నీళ్లు, 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యంగా ఎల్‌ఎల్‌బీసీ ని ప్రారంభించామన్నారు. భయట ఉన్న వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు.
Also Read: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్!
ఎస్‌ఎల్‌బీసీ లాంటి పెద్ద ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదని, కార్మికులు బయటికి వస్తారనే ఆశ ఉందని కోమటిరెడ్డి తెలిపారు. కార్మికులు వందల కిలోమీటర్ల దూరం దాటి పని కోసం వచ్చారని, అస్సాం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, బీహార్ తదితర రాష్ట్రాలనుంచి వచ్చిన కార్మికులు టన్నెల్‌లో పనిచేస్తున్నారన్నారు.వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల్లగా ఏళ్ల తరబడి ఫామ్ హౌజ్ లో పడుకోలేదని ఎద్దేవా చేశారు. తమను పంపించి సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ ఉంది కదా అని కేటీఆర్ ఏది పడితే అది పోస్టులు పెడుతున్నారని, ప్రమాదాన్ని రాజకీయం చేయాలనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి: SLBC: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు!
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి ప్రమాద స్థలం వద్ద సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులను రక్షించేందుకు శ్రమిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలను ఆయన అభినందించారు. ఈ రోజు మరోక ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొంది. కాగా సంఘటన జరిగిన 40 మీటర్ల చేరువకు రక్షక దళాలు చేరుకున్నాయని తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులను అంచనా వేస్తూ రెస్య్కూబృందాలు ముందుకు సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: మహా శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు?
ఇది కూడా చదవండి: అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే అనర్థాలు