CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్‌ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీసీలకు రిజర్వేషన్‌ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు.

New Update
 CM Revanth Reddy at janthar Manthar

CM Revanth Reddy at janthar Manthar

CM Revanth Reddy :  బీసీలకు రిజర్వేషన్‌ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. జనాభా లెక్కలు తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
  
జనగణనలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినందుకే బీజేపీ కుట్రపూరితంగా జనగణన వాయిదా వేస్తోందని రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క 56.36 శాతం అని తేల్చింది. గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదు.రాహుల్ గాంధీ మాట ప్రకారం తెలంగాణ మొట్టమొదటి సారి కులగణన చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచమన్న డిమాండ్ మాత్రమే కాదు, ఉద్యోగ, విద్య రంగంలో కూడా ఈ పెంపు ఉండాలని నిర్ణయించాం.రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యవహారం. అందుకే మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. మేము మా రాష్ట్రంలో పెంచుకుంటాం అన్నాం. మీ (మోదీ) రాష్ట్రంలో చేయమని మేము అడగలేదని సీఎం గుర్తు చేశారు. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచితే నరేంద్ర మోదీకి వచ్చిన కష్టమేంటి? మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల కోసం 42 శాతం ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే.. మీకు ఏం కష్టం వచ్చింది? మా తీర్మానం ప్రకారం రిజర్వేషన్లు పెంచమని కోరుతూ బీజేపీ నేతలను బీసీ సంఘాలు కలిశాయి. అయినా ఉలుకు లేదు. పలుకు లేదు.అందుకే ఢిల్లీలో బీసీ మహా ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి బీసీ సంఘాలకు ఏర్పడిందని రేవంత్‌ రెడ్డి అన్నారు.కురుక్షేత్ర యుద్ధంలో చెప్పినట్టు "అయిననూ హస్తిన పోయి రావలె".. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూడొద్దు. నిజాం పాలకులకు ఏ గతి పట్టిందో చూశారు. ఆంధ్రా పాలకులకు ఏం జరిగిందో చూశారు.మీరెప్పుడూ ఢిల్లీలో ఉండరు. గల్లీలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారు.

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

చిన్న సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు మా బీసీ జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే ఎలా మర్చిపోతారు?దేశమంతటా మీరు అమలు చేస్తారా లేదా అని నేను అడగడం లేదు. మా తెలంగాణలో తీర్మానం చేసిన ప్రకారం పెంచమని మాత్రమే అడుగుతున్నామన్నారు.రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించినా సరే అనేక బిల్లులు తెచ్చి చట్టాలు చేశారని ఆరోపించారు.ట్రిపుల్ తలాఖ్ తెచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. వ్యవసాయంపై నల్ల చట్టాలు తెచ్చారు. మరి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఏం సమస్య వచ్చింది? అంటూ నరేంద్రమోదీని సీఎ నిలదీశారు.బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని బండి సంజయ్ అంటారు. మాకు మీ ప్రాణాలు వద్దు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి చాలు అంటు గుర్తు చేశారు. ?

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

మీరు మా డిమాండ్లకు దిగి రావాలి. లేదంటే మీరు దిగిపోవాలి, బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి. నరేంద్ర మోదీ గారు వినండి. మేము ఇక ఢిల్లీకి రాం. మీరే మా గల్లీకి రావాలంటూ సంచనల ప్రకటన చేశారు సీం రేవంత్‌ రెడ్డి,. కురుక్షేత్ర యుద్ధంలో 5 గ్రామాలు ఇవ్వాలని సంధి ప్రయత్నం జరిగింది. కానీ దుర్యోధనులు వినలేదు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. మేము కూడా ఇప్పుడు సయోధ్యకు వచ్చాం. మా రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం చెప్పండి లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను...కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.

New Update

ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

Also Read :  ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీరే కోటీశ్వరులు

Also Read :  తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also read : Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

Also Read :  ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

 

bjp | owaisi-brothers | telugu-news | mla raja singh | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment