Telangana News: నిజామాబాద్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.
ఢిల్లీ పెద్దలు వరుసగా తెలంగాణ బాట పడుతున్నారు. రెండు జాతీయ పార్టీల(కాంగ్రెస్, బీజేపీ)కు చెందిన టాప్ లీడర్లు వరుస పెట్టి తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో బడా నేతల చూపు తెలంగాణపై పడింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. నిజామాబాద్లో మోదీ రోడ్ షో ఉండే అవకాశముంది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు డీఎస్. గతంలో పీసీసీ చీఫ్గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్తో పాటు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్లో చికిత్స పొందుతున్నారు.
బోధన్ పట్టణంలోని ఆదివారం గణేష్ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ శాంతి యుతంగా జరుపుకోని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.