Telangana: తెలంగాణలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్!

తెలంగాణలో మరోసారి టెన్త్ ఎగ్జామ్ పరీక్ష లీక్ కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి గణిత ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. అక్కడపనిచేసే సిబ్బంది కాగితం ప్రశ్నలను రాయించి బయటకు పంపాడు.

New Update
Telangana 2025  10th paper leaked

Telangana 2025 10th paper leaked

తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో మరోసారి కలకలం రేగింది. బుధవారం జరిగిన గణితం ప్రశ్నాపత్రంలో నుంచి కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ విద్యార్ధి తండ్రి లోపల తాగునీరు అందించే వ్యక్తికి తెల్ల కాగితం ఇచ్చి పంపగా.. అతడు దానిపై కొన్ని ప్రశ్నలను రాసుకొని బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరోవ్యక్తి వాటిని ఫోటోలు తీసి విలేకర్లకు పంపాడు. దీంతో విషయం బయటకొచ్చింది.  అనంతరం రంగంలోకి దిగిన ఎస్పీ నర్సింహరెడ్డి, జిల్లా విద్యాధికారి రాజు తదితరుల పేపర్ లీకేజ్ కి కారణమైన  కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. 

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Also Read :  ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!

10th Class Paper Leak Case - Kamareddy

latest-news | telugu-news | 10th paper Leak case | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana news live updates | 10th Exam Paper Leak | 10th Exam Paper Leak Case

Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

Also Read :  షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్‌ మెడిసిన్ ధరలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kamareddy: పండగపూట విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి

కామారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉగాది రోజే నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి మౌనిక ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. చెరువులో దిగిన పిల్లలను కాపాడటానికి ప్రయత్నించిన తల్లి కూడా చనిపోయింది.

New Update
kamareddy 10110

kamareddy 10110 Photograph: (kamareddy 10110)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పండగపూట కుటుంబంలో నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి ఆదివారం మౌనిక ఆమె ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. తల్లి బట్టలు ఉతుకుతుండగా  ముగ్గురు పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. చెరువులో ఓ ప్రదేశంలో లోతైన గుంట ఉంది. అందులో పడి పిల్లలు నీటమునిగారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమె కూడా నీటమునిగి మరణించింది.

Also read: Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్‌లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు

పిల్లలూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లి మౌనిక(26), పిల్లలు మైథిలీ(10), అక్షర(8), వినయ్ (5)గా గుర్తించారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో గ్రామంలో ఇలా జరగడంతో విషాఛాయలు అలుముకున్నాయి. భార్య తరపు బంధువులు భర్తే హత్య చేశాడని ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?

Advertisment
Advertisment
Advertisment