SLBC Tunnel: బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి...గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు

శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. భారీ బండరాళ్ళు కూలిన కారణంగా టీబీఎం, కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి అని ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నారు.

New Update
slbc

SLBC Tunnel

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. నిన్న  పరిస్థితిని అంచనా వేయడానికి  34 మందితో కూడిన సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. సహాయక చర్యలు చేపట్టానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేదని ర్యాట్ మఓల్ మైనర్స్ చెబుతున్నారు. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని తెలిపారు. 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారిందని ఎన్డీఆర్ఎఫ్ బృందం వివరించింది. పై నుంచి బండరాళ్ళు కూలడం వలన అక్కడంతా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయిని చెప్పారు. సొరంగం లోపల నీరు కన్నా బురద శాతం ఎక్కువగా ఉందని..దీని వలన కాళ్ళు, చేతులు కదిలించే పరిస్థితి లేదని తెలిపారు. 

మట్టి, బురద..నో ఆక్సిజన్..

టన్నెల్ చివరిలో పైకప్పు నుంచి మట్టి ఇంకా పడుతూనే ఉంది. దీంతో 15 అడుగుల స్థాయిలో ఊబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలులేదని ర్యాట్ హోల్ మైనర్స్ అప్డేట్ ఇచ్చారు. డ్రోన్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేవని అన్నారు.  టన్నెల్ లో 12వ కి.మీ దాటిన తర్వాత బురద, నీళ్ళల్లో నడిచి వెళ్ళాల్సి రావడంతో రక్షణ బృందాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఒకవేళ అలా వెళ్ళడానికి ట్రై చేసినా కూడా అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. దీంతో ముందు వెళ్లాలంటేనే సహాయక బృందాలు భయపడుతున్నాయి. సొరంగంలో 3 కి.మీ. వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నళ్లు వస్తున్నాయి. కొంతదూరం వరకు ఇంట్రకాం, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పని చేస్తున్నాయి. తమకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తే  చివరివరకు చేరుకుంటామని ర్యాట్ హోల్ మైనర్లు చెబుతున్నారు.

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

New Update
Husband attacks wife

Husband attacks wife

Husband attacks wife : కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ‌తుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
 
 గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బ‌తుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌క‌తాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.

 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ ఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

 

Advertisment
Advertisment
Advertisment