/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dark-chocolateMilk-chocolate-which-is-better-for-health-jpg.webp)
పెద్ద దొంగలను ఏమీ చేయలేరు కానీ చిన్న పిల్లల మీద మాత్రం ప్రతాపం చూపిస్తారు. తిరిగి వాళ్ళు ఏమీ చేయలేరనే ధైర్యంతో. ఇబ్రహీంపట్నంలో చాక్లెట్ దొంగలించాడని ఓ బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ళ బాలుడు మంచాల మండలం నోములలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఇబ్రహీంపట్నంలో ఉన్న మెగా డీమార్ట్ కు సరుకులు కొనుక్కోవడానికి వచ్చాడు.
అండర్ గ్రౌండ్ లో కట్టేశారు..
అయితే అప్పుడే అదే సమయంలో ఆ పిల్లాడిని చాక్లెట్ దొంగతనం చేశాడంటూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మెగా డీమార్ట్ యజమానులు, నిర్వాహకులు నేరం ఆరోపించారు. వెంటనే అతనిని బంధించి అండర్ గ్రౌండ్ లో ఉన్న గొడౌన్ లోకి తీసుకెళ్ళి కట్టేశారు. అక్కడే రాత్రి 8 గంటల వరకు ఉంచి చిత్రహింసలు పెట్టారు. విపరీతంగా కొట్టారు. తరువాత ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ముందుకు వచ్చా ఆందోళన నిర్వహించారు. దాంతో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. బాలుడిని రెస్క్యూ చేసి మొదట స్టేషన్ కు తీసుకెళ్ళారు. తరువాత ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీ మార్ట్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
today-latest-news-in-telugu | chocolate | boy | theft
Also Read: Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు