/rtv/media/media_files/2025/03/10/kOyDHG0ySOpHqioHdRyf.jpeg)
Prannoy murder case Photograph: (Prannoy murder case)
మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్టీఎస్సీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో నిందితుల్లో ఏ2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ ఆఖరి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అమృత బాబాయ్ కూడా ఇందులో ఉన్నారు. ప్రణయ్ హత్యకేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, A3 అజ్గర్‌అలీ, A4 అబ్ధుల్‌బారీ, A5 ఎం.ఏ కరీం, A6 తిరునగరు శ్రవణ్‌కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు 2020మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Death sentence to the A2 and A1 father Maruthi Rao suicide - and life for remaining persons in Pranay murder case. No honour in honour killing pic.twitter.com/ve42aF2qfX
— Lokesh journo (@Lokeshpaila) March 10, 2025
2018 సెప్టెంబర్ 14న హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఇది ఒక పరువు హత్య.. తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి పెరుమళ్ల బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: Amrutha Prannoy murder case: మిర్యాలగూడ పరువు హత్య కేసులో 5ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు
ఈ కేసు పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ ప్రారంభించింది. 5సంవత్సరాల 9నెలల కాలం పాటు విచారణ కొనసాగగా, పోలీస్ శాఖ సమర్పించిన చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈరోజు వెల్లడించింది.