Bird flu cases : అంతుచిక్కని వ్యాధి..లక్షల్లో కోళ్లు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనితో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే తెలంగాణకు ఆ సమస్యలేదు అని అనుకుంటుండగానే అంతుచిక్కని వ్యాధితో పలు జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు.

New Update
 kills millions of chickens

kills millions of chickens

Bird flu cases : ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనితో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే తెలంగాణకు ఆ సమస్యలేదు అని అనుకుంటుండగానే అంతుచిక్కని వ్యాధితో పలు జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. తెలంగాణ లో ఒకవైపు బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తుండగా.. కొక్కెర వ్యాధి సైతం విజృంభిస్తోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. లక్షల్లో పెట్టుబడిన పౌల్ట్రీల నిర్వాహకులు వాటిని పూడ్చిపెడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయని పెంపకందారులు చెబుతున్నారు. అధికారులు కేవలం శాంపిల్స్ సేకరించడంతోనే సరిపెడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుల్కల్, చౌటుకూరు మండలాల్లో 3 రోజుల వ్యవధిలో 20వేల కోళ్లు చనిపోయాయి. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లాలోని కోళ్ల ఫారాలు మూతపడుతున్నాయి.

Also Read: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’
 
తాజాగా.. మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు.కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకు 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయానని రైతు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పక్కనే బాయిలర్ కోళ్ల ఫామ్ ఉండటంతో వాటికి వచ్చిన రోగమే నాటుకొళ్లకి సోకిందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో లక్షల సంఖ్యలో బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. కాగా.. చనిపోయిన నాటుకోళ్ల శాంపిల్స్ సేకరించి అధికారులు ల్యాబ్ కి పంపారు.

Also Read: కన్నీటి పర్యంతమైన ప్రణయ్ పేరెంట్స్.. సమాధి వద్ద నివాళి (VIDEO)

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్‌లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 12,200 బాయిలర్‌ కోళ్లు వీవీఎన్‌డీ(కొక్కెర)వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతు చల్ల కృష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఇదే గ్రామంలో రెండు రోజుల క్రితం ముత్యాల వెంకటరెడ్డికి చెందిన ఫామ్‌లో 7 వేల కోళ్లు మృతి చెందగా.. 10లక్షల వరకు నష్టం వాటిల్లింది.

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

 మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. వైరస్‌ సోకడంతో వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని వాటి పోషణదారులు సంగెం జనార్ధన్‌, ఆరె యాదగిరి, మినిపూరి భూపాల్‌రెడ్డి వాపోయారు. కాగా మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు